రెండు రోజులు పోయాక నలుగురూ కూర్చొని కాశీ ప్రయాణం గురించి ఆలోచించాము. 2007 డిసెంబరు ఆఖరి వారంలో వెళ్ళి వస్తే బాగుంటుందనుకున్నాము. ఒక పది పేర్లు ప్రతిపాదించుకున్నాము. అందులో కనీసం ఆరుగురయినా వస్తారని ఆశ. పండక్కి తిరిగి వచ్చేయవచ్చు. ఆ తరువాత అయితే ఇక్కడ జరుగుతున్న పనులు పూర్తవడానికి సమయం ఉండదు. ఇలాగ అనుకున్నాక మరునాడు ఉదయం పాతూరు రామాలయం దగ్గరకు వెళ్ళాను, ప్రయాణం సంగతి మాట్లాడదామని.
అక్కడ పరిస్థితి చూసి మాట రాలేదు. రాత్రికి రాత్రి కాశీ ప్రయాణం గొడవ ఎలా పాకిపోయిందోకాని జనం పెద్ద గుంపుగా ఉన్నారు. ఇద్దరు మనుషులకు చేతినిండా పనితో ఊపిరి ఆడటం లేదు. ఒకళ్ళు పేర్లు, వయస్సు రాసేవాళ్ళు మరి ఒకళ్ళు 1500 రూపాయలు టిక్కెట్ల కోసం వసూలు చేసేవాళ్ళుతో గందరగోళంగా ఉంది. ఒక రెండు గంటలు గడిచేటప్పటికి సుమారు 86 పేర్లు నమోదయ్యాయి.
ఒక వారం రోజులలో ప్రయాణం. ఇన్ని Tickets దొరుకుతాయో లేదో తెలియదు. వెంటనే రాజమండ్రి రైల్వేస్టేషను కు బయలుదేరిపోయాం. హైదరాబాదు నుండి వారణాసికి వెళ్ళే రైలయితే starting station కాబట్టి దొరుకుతాయని దానికి రిజర్వేషను రాసి ఇచ్చాం. ఆ ఫారాలు ఒక వారం రోజుల తరువాత Return Journey ఉండేలాగ పూర్తిచేసి కౌంటరులో ఇచ్చాం. ఒక మంచి క్లర్కు ఉన్నారు. స్వామి దయ ఉంటే ఇంకేం కావాలి? ఆయన అవి అన్నీ చూసుకుని క్యూలో ఉన్నవారికి ఒక టిక్కెట్టు, తరువాత మా గ్రూపులో ఆరుగురికి ఒక ఫారం ఉండటం వలన అది ఒకటి చొప్పున క్యూలైన్లో ఉన్నవాళ్ళకి ఇబ్బంది లేకుండా, మా పని కూడా అయ్యేలాగ టిక్కెట్లు కొట్టడం ప్రారంభించాడు.
అలాగ ఒకటి రెండు గంటలు అయ్యేటప్పటికి అందరి టిక్కెట్లు వెళ్ళడానికి, రావడానికి తయారయిపోయాయి. వాటికయిన మొత్తం సొమ్మును ఒక కాగితం మీద వేసి మొత్తం టిక్కెట్లను Calculator ని బయటకు లెక్క చూసుకోవడానికి ఇచ్చారు. అవన్నీ తీసుకుని పేర్లను, సొమ్మును సరి చూసుకుని వారికి చెల్లింపు చేశాము. ఒక్కరికి కూడా Ticket రాలేదు అనే బాధ లేకుండా అందరికీ రిజర్వేషను దొరికింది.
ప్రయాణం దిగులు
ఇంతవరకు బాగానే ఉంది. అస్సలు ఊహించని ఉత్సాహం ప్రజల్లో కలిగింది. కానీ వీరెవరికీ హిందీ రాదు. మనకీ కాశీలో ఇంతమందికి వసతి ఇతర అవసరాలు ఎలా సమకూర్చాలో తెలియదు. డిసెంబరు నెలలో అక్కడ విపరీతమయిన చలి ఉంటుందని తెలుసు. ఎవరూ తప్పిపోకుండా క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యం. Tickets S1 నుండి S10 వరకు అన్నిబోగీలలోను ఖాళీలను బట్టి వచ్చాయి. ఒక అయిదారుగురు ఒంటరివాళ్ళం ఉన్నాం. మిగతావారంతా కుటుంబాలతో ఉన్నారు. Booking Order లో రకరకాల చోట్ల బెర్తులు వచ్చాయి. అవన్నీ తిరగరాసి, ఒక గ్రూపు వాళ్ళు ఒక చోట ఉండేలాగ List తయారు చేశాము.
మాధవరావుగారు 2 బాక్సులు ఆపిల్సు కొన్నారు. నేను ముందు రోజు హైదరాబాదు వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళందరూ మరునాడు జన్మభూమి ఎక్సుప్రెస్ లో సికిందరాబాదు చేరుకున్నారు. నేను రైలు బయలుదేరే సమయానికి ఒక గంట ముందు Station కు చేరుకున్నా. అప్పటికి ఆయన Apples పంచుతున్నారు.
ఈ లోపల Train Platform మీదకు వచ్చింది. అందరూ కంగారుగా లేచిపోయారు. ఎవరిని ఏ పెట్టెలోకి పంపాలని చూస్తూ ఉంటే Tickets కనపడటంలేదు. ఆయనకు ఒకటే కంగారుగా ఉంది. ఏం జరిగిందో అర్థం అవటానికి కాస్త Time పట్టింది. ఈ లోపల నా సీటెక్కడంటే నా సీటెక్కడని జనం కంగారు పడుతున్నారు. అసలే Platform అంతా ఎంతో గోలగా ఉంది. అరచినా ఎవరికీ ఏమీ వినపడేలాలేదు.
ఆయన వెనక్కి పరిగెత్తి Apples పంచిన చోట వెతికాడు. భగవంతుడి దయవల్ల Tickets అన్నీ క్షేమంగా దొరికాయి. List ఎక్కడో పారేశాడు. ఈ లోపల Train Time అయిపోయింది. అందరూ సామానుతో సహా ఎదురుగా ఉన్న బోగీలోకి ఎక్కేశారు. డిసెంబరు నెలలో కూడా చెమటలు పట్టాయి. టిక్కెట్లు దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక బోగీలో ఎన్ని సీట్లు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రకారంగా జనాల్ని S1 నుండి S10 వరకు తీసుకు వెళ్ళి ఈ సీటు(బెర్తు) నీది పడుకో అని చెప్పి తెల్లవారాక మార్పులు చేసుకుందామని అందరినీ సద్దేటప్పటికి రెండు గంటల Time పట్టింది. ఈ లోపల T.C. ల హడావుడి. వాళ్ళకి వివరం చెప్పి తరువాత చూసుకోమన్నాము. ఇంకొన్ని తలనొప్పుల తరువాత మొత్తం మీద అందరూ settle అయ్యారు. తెల్లవారాక వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని Adjust అయ్యారు.
తిరుగు ప్రయాణంలో ఇటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉండటానికి రైలు ప్రయాణంలో ఉండగానే నేను మాధవరావు గారు ఖాళీలను బట్టి కుటుంబాలను బట్టి ఏ బోగీలో ఎవరు ఎక్కాలో పక్కా List తయారు చేశాము. అందువలన తిరుగు ప్రయాణంలో ఏ ఇబ్బందులు రాలేదు. ఎవరి బోగీ దగ్గర ఆ గ్రూపువాళ్ళందరూ విడిగా కూర్చున్నారు. రైలు రాగానే ఎక్కెయ్యగలిగారు.
అరుణ కుమార్ గారు: ఒకరోజు ప్రయాణం దగ్గరకొచ్చాక మల్లేపల్లి నుండి అరుణ కుమార్ గారు సడన్ గా Motor Cycle మీద వచ్చి గుడి దగ్గర ఆగారు. ఆయన్ను అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆయన గొల్లబాబు గారికి ఎక్కువ పరిచయస్తుడని తరువాత తెలిసింది. వచ్చీరాగానే నన్ను చూసి ప్రశ్నల వర్షం కురిపించారు. కాశీ గురించి, అక్కడ శివలింగానికి చేయవలసిన ప్రాధమిక ఉపచారాల గురించి అడిగారు. నాకేమీ తెలియదన్నాను. కాసేపటికి నన్ను అర్థం చేసుకున్నారు. ఆయనకు కాశీ యాత్రల అనుభవం ఉందని తెలిసింది. ఈ జనాన్ని Manage చేసే బాధ్యత, శివలింగానికి ప్రాధమిక ఉపచారాలు చేసి ఇక్కడకు తీసుకువచ్ఛే బాధ్యత తీసుకుంటానన్నారు. మొదట వచ్చీ రాగానే కాస్త దూకుడుగానే ప్రవర్తించారు. తరువాత అంతా ప్రశాంతం. నా నెత్తి మీద నుండి పెద్ద బరువు దిగిపోయిన్నట్లు అయ్యింది. ఇది ఆ స్వామివారు చేసిన మరి ఒక ఉపకారం. ఆయనకు మరియొక ఆరుగురికి తత్కాల్ లో టిక్కెట్లు తీసుకున్నాము.
రైలు సికిందరాబాదు నుండి రెండు రాత్రిళ్ళు ఒక పగలు ప్రయాణం. కొంచెము Late గా ప్రయాణించడం వలన తెల్లవారగట్ల సుమారు 4 గంటలకు అలహాబాదు చేరుకునేలా ఉంది. నా ప్రోగ్రాము ప్రకారం అందరూ కాశీలో దిగి బసలో చేరుకున్నాక 4 రోజులు ఉంటాము కాబట్టి ఎవరికి నచ్చినట్లు వారు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్ళి ఏది కావాలంటే అది చూసుకోవచ్చనుకున్నాను. కానీ అరుణ కుమార్ గారు అందరూ అలహాబాద్ లో దిగిపోతే ఇక్కడ త్రివేణీ సంగమస్నానం తీర్థ విధులు చేసుకుని కాశీకి వెళ్ళవచ్చు, లేకపోతె ముందుకు 200 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనక్కు రావలసి వస్తుందని చెప్పినట్లున్నారు. కొంతమంది నన్ను సంప్రతించడానికి వచ్చారు.
ఎలాగూ Program బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి నేనేమీ అడ్డుచెప్పలేదు. కాకపొతే అనేక కంపార్టుమెంటుల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆ సమాచారం అందించి అందరూ దిగేలాగ చూడటం ఒక పెద్దపని. ఎవరయినా మిగిలిపోతే వాళ్ళు చాలా తిప్పలు పడాల్సి వస్తుందని భయం. అలా తప్పిపోయిన వాళ్ళను గుర్తించడం పట్టుకోవడం ఇంకా పెద్దపని. సరే ఏం చేశారో ఎలా తిప్పలు పడ్డారో మొత్తం అందరినీ అప్రమత్తం చేసి తెల్లవారకుండా అందరూ అలహాబాద్ లో దిగిపోయారు. అక్కడ నుండి ఒక పండా గారి విశాలమయిన విడిది లాంటి చోటికి చేరాము. మహా చలిగా ఉంది. ఉదయం అవసరాలు తీర్చుకున్నాక అందరినీ గంగా నది ఒడ్డుకు తీసుకు వెళ్ళారు. అక్కడ నుండి త్రివేణీ సంగమం వరకు అనేక పడవలలో వెళ్ళాము. ఎన్నో నీటి పక్షులు ఎగురుతున్నాయి. యాత్రికులు అవి తినడానికి ఏవో గింజలు వేస్తున్నారు.
సంగమం దగ్గర యమున ఒరవడి ఎక్కువగా ఉంది. నీళ్ళు ఐసు అంత చల్లగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు రెండు మునుగులు మునిగి పడవలు ఎక్కేశాము. ఎందుకో నాకు అంతగా వణుకు రాలేదు. జీవితంలో ఎన్నో సంవత్సరాలు తరువాత గంగా నదిని దర్శించే భాగ్యం కలిగినందుకు ఉద్వేగంగా ఏడుపు మాత్రం వచ్చింది.
తరువాత గంగ ఒడ్డున తీర్థ విధులు నిర్వహించుకుని బస దగ్గరకు చేరాము. మేము కొడరము పెందరాళే బయలుదేరి రాత్రి 8:00 గంటలకు బస్సులో వారణాసి చేరిపోయాం. అంతకు ముందే మాట్లాడుకున్న సత్రంలో రూముకి చేరిపోయాం. మిగతావాళ్ళు ఆర్ధరాత్రి దాటాక రైలులో వారణాశి చేరి చాలా ఇబ్బందులు పడ్డారు.
తెల్లవారాక వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో కనిపెట్టి అందరు కలుసుకుని ఆంధ్రా ఆశ్రమానికి చేరిపోయాం. అంతటితో కాశీలో వసతి సమస్య తీరింది. అక్కడ నుండి నాలుగు రోజుల దాకా ఎవరి ఇష్టం వారిది. కాశీలో, ఆ చుట్టుపక్కల, అయోధ్య, గయ ఇలాగ ఎవరి అవకాశం ప్రకారం వాళ్ళు తిరిగారు.
మేము నలుగురం మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. కాశీ విశ్వేశ్వరుడి దివ్య దర్శనం చేసుకున్నాక మెయిన్ రోడ్ లో ఉన్న శిల్ప నిలయానికి వెళ్ళాం. వాళ్ళకు మేము వచ్చిన పని గురించి చెప్పి నర్మద బాణ లింగం ఎక్కడ దొరుకుతుందోనని అడిగాం. వాళ్ళదే ప్రధానమయిన పని కేంద్రం (work shop) ఒక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది Show Room. ఆ Address ఇచ్చి రిక్షాలను పిలిపించి అక్కడకు పంపించారు.
అక్కడ అనేక వేల శివలింగాలు ఉన్నాయి. మాకు 9″ size ఉన్న ఒక ఉత్తమమైన శివలింగాన్ని ఇమ్మన్నాము. మంచి చెడ్డల సంగతి తెలియదు. అంతా మీదే బాధ్యత అని చెప్పాము. ఆ మరునాడు ఇస్తామన్నారు. అక్కడే కృష్ణ భగవానుడి విగ్రహం కూడా Select చేసుకున్నాము. దానికి తుది మెరుగులు దిద్ది రెండు రోజులలో తయారు చేసి ఇమ్మన్నాము.
ఆ మరునాడు ప్రస్తుతం ఆలయంలో విరాజిల్లుతున్న శివలింగాన్ని ఇచ్చారు. గొల్లబాబు గారు తీసుకున్నారు. ఆ రాయి లోనే ఒక మచ్చ ఉంది. అది అర్జున బాణం అంటారని తరువాత తెలిసింది. Show Room లో 108 పాలరాతి శివలింగాలు, ఒక 4″ శివలింగం, దక్షిణావృత శంఖం, పూరించే శంఖం, చామరం కొన్నాము.
తిరుగు ప్రయాణం రోజు ఉదయం వరకు మిగతా వారంతా రక రకాల వ్యాపకాలు, విహారాలు పూర్తి చేసుకుని శివలింగం ఎక్కడ, మీరేమి చేశారు అని మమ్మల్ని అడిగారు. అప్పటిదాకా ఆ పని మీద ఎవరైనా ఉన్నారా, ఏమయింది అని పట్టించుకున్నవాళ్ళు లేరు. బహుశ ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఏదో చేసే ఉంటామని నమ్మకం కావచ్చు.
ఆ ఉదయం సుమారు 10 గంటలకు ఒక 20 మంది దాకా మాతో వచ్చారు. శివలింగం 25kg ల 200 గ్రాములు బరువు ఉంది. మాతో వచ్చిన వాళ్ళకి కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కూడా చూపించాము. దానికి తుది మెరుగుల పని జరుగుతోంది. సాయంత్రానికి పూర్తిచేసి Packing చేసేయమన్నాము. Station కి వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుని వెళ్ళిపోతామన్నాము.
శివలింగాన్ని అరుణ కుమార్ గారికి అప్పజెప్పాము. ఆయన దానిని తీసుకుని గొల్లబాబు గారి బృందంతో బయలు దేరి తిన్నగా మణికర్ణికా ఘట్టానికి తీసుకువెళ్ళి గంగా జలంతో అభిషేకించి, కాలభైరవుడి దగ్గర పెట్టి పూజ చేయించి తల మీద పెట్టుకుని విశ్వేశ్వరుడి సన్నిధికి తీసుకు వచ్చారు. బలమైన మనిషి అవటం వలన Q లో కొన్ని ఇబ్బందులు ఎదురయినా స్వామి వారి సన్నిధి దాకా అలాగే శిరసు మీదే ఉంచుకుని, సన్నిధిలో అభిషేక జలాలతో ముంచి తీసి అన్నపూర్ణ తల్లి సన్నిధిలో కొత్త వస్త్రంలో కట్టి స్టేషన్ కు తీసుకు వచ్చారు. మేము 108 శివలింగాలు, శంఖాలు ప్యాకింగు చేయించి దారిలో Work Shop వద్ద సిద్ధంచేయబడిన కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని తీసుకుని Station చేరాము. ఈ సారి ముందుగానే ఎవరి coach లో ఎవరు ఎక్కాలో పక్కాగా తయారు చేసి ఉన్న list ల ప్రకారంగా వాళ్ళు గ్రూపులుగా విడిపోయి Platform పొడుగునా గుంపులుగా కూర్చుండటం వలన ఎటువంటి ఇబ్బంది రాలేదు.
రైలు నాలుగు గంటలు లేటుగా వచ్చింది. అర్ధరాత్రి దాటిపోయినా తరువాత ఎక్కగలిగాము. ఎవరి బోగీలోకి వారు కంగారుగా ఎక్కేశారు (తిరుగు ప్రయాణంలో అందరికీ సామాను పెరిగింది, కాశీలో కొనుగోళ్ళ వలన). ఒక్క కృష్ణుడి విగ్రహం మాత్రమే Platform మీద ఉండి పోయింది. ఎత్తేవాళ్ళు లేక. ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాను ఎక్కించుకునే ఆత్రుతలోనే ఉన్నారు. ఈ లోపల బాబులుగారు, సూర్యనారాయణ గారు గబ గబా వచ్చి కృష్ణుడిని కూడా రైలు ఎక్కించారు. బరువుగా ఉండటం వలన Packing దెబ్బ తినకుండా ఉండటం కోసం Door పక్కనే ఉన్న మొదటి బెర్తు క్రిందకు చేర్చాము. పూర్తిగా క్రిందకు వెళ్ళలేదు. సగం లోపలకు సగం బయటకు ఉండిపోయింది. సరిగ్గా ఆ బెర్తు మీద ఒక ముస్లిం కూర్చుని ఉన్నాడు. ఆ Packing ఏమిటో తెలియదు కాబట్టి ఒక కాలు కూడా దాని మీద పెడుతున్నాడు.
తెల్లవారిన తరువాత ఆయనకు ఆ Packing లో ఉన్నది కృష్ణ భగవానుడి విగ్రహం అని దాని మీద కాళ్ళు పెట్టవద్దని, ఆయనకు ఇబ్బందిగా ఉంటే మాది ఏదయినా బెర్తు మీదకు మారితే మేము ఎవరయినా అక్కడకు వస్తామని చెప్పాము. ఆయన బెర్తు మారలేదు కానీ కాళ్ళు పెట్టనన్నాడు.
అలాగ ఆ పగలు రాత్రి గడిచినాక రైలు విజయవాడ చేరింది. ఉదయం అందరము దిగి ఉదయం అవసరాలు తీర్చుకుని టిఫిన్స్ చేసి 9 గంటలకు సింహాద్రి ఎక్సుప్రెస్ లో రాజమండ్రి చేరాము. అరుణ కుమార్ గారు రోజూ రెండు పూటలా రైలులో స్నానం చేసి స్వామి వారికి పూజాదికాలు నిర్వహించారు. రాజమండ్రిలో శివలింగాన్ని మార్కండేయ స్వామి ఆలయంలో అప్పచెప్పాము. ప్రతిష్ఠ జరిగేంతవరకూ అక్కడ పూజాదికాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.
కృష్ణ భగవానుడిని కారులో ఇంటికి చేర్చి Parcel తీసి చూశాము. ఎటువంటి Damage లేకుండా ఉంది. 2008 జనవరి నెలలో సంక్రాంతి పండుగ తరువాత ముగింపు దశలో ఉన్న అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. రోజూ 20 మందికి తక్కువ లేకుండా పనివారు రక రకాల పనులు చేస్తున్నారు. వారికి కావలసిన సరుకులు అందించడం రేపు చేయవలసిన పనులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రోజుకి 16 గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించ వలసి వచ్చేది.
యాగశాల నిర్మాణం