తులసి కోట
తులసి కోట కట్టడానికి అయ్యే ఖర్చు నేనిస్తానని భేరి సరస్వతి గారు అన్నారు. సాధారణంగా తులసి కోట అంటే ఒక దిమ్మలాగా కట్టి మధ్యలో ఒక తులసి మొక్కను వెయ్యటం. దిమ్మకు అలంకరణలు చెయ్యటం. కానీ ఇక్కడ అలాగ కాకుండా 10’X10′ (feet) Platform తయారు చేసి దాని మధ్యలో గుండ్రంగా రెండు అంచెలలో తులసిని పెంచి దాని మధ్యలో ఒక చిన్న గోపురం నిర్మించి అందులో కృష్ణ భగవానుడి పాలరాతి విగ్రహం పెడితే బాగుంటుందని నా ఊహ.
ఇది చెప్పి అర్థం అయ్యేలా చెయ్యడం అంత సులభం కాదు. అలాగని ఆ Design ఎక్కడా లేదు. అందువలన కొంచెం వివరించి 30,000 రూపాయలు ఖర్చవుతుందన్నాను. దానికి ఆవిడ ఒప్పుకుంది. ఆ ప్రకారం నిర్మాణం చేసి తులసి కోటకు బదులు తులసివనంలో కృష్ణ భగవానుడు కొలువు తీరి దర్శనమిస్తున్నాడు. Gate తీసుకుని లోపలికి రాగానే ముందుగా కనపడే తులసి బృందావనం, మొత్తం ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానం చేస్తోంది. కృష్ణ భగవానుడి విగ్రహం కాశీ నుంచి తీసుకు వచ్చాము. అక్కడ ఆ విగ్రహం 9,500-00 అయ్యింది. ఇక్కడ 30,000 వరకూ చెప్పారు.



ఉత్సవ మూర్తులు
పంచలోహ ఉత్సవ మూర్తులు తయారు చేయించడానికి ధవళేశ్వరం వెళ్ళాము. అక్కడ విగ్రహాలు పోత పొసే వారిని సంప్రతించాము. మేము కోరిన కొలతలలో ఈశ్వరుడు అమ్మవారు, గణపతి విగ్రహాలు చేయడానికి సుమారు 100kg ల బరువు వరకు వస్తుందని అర్థమయ్యింది. 1kg కి 1400 రూపాయలు అవుతుందన్నారు.
చిన్న విగ్రహాలు చేయించడానికి మనసు ఒప్పటం లేదు. పెద్దవి చేయించడానికి సొమ్ము లేదు. వీటి కోసం కూడా లక్ష రూపాయలు కావాలి. అసలే రూపాయలకి ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ అందరికి నీరసం వచ్చేసింది.
జంగారెడ్డిగూడెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గుడికి ఉత్సవ మూర్తులను కుంభకోణంలో తయారు చేశారు. వారు విగ్రహాలు ఎంతో నైపుణ్యంగా తయారు చేస్తారు. దానికి ఎంతో నియమ నిష్ఠలను కూడా పాటిస్తారని విన్నాము. మా తమ్ముడు గారు స్వయంగా కుంభకోణం వెళ్లి ఆ విగ్రహాలు పోత పొసే కార్యక్రమం చూడటం జరిగింది. ధవళేశ్వరం నుండే ఆయనకు Phone చేసి ఇక్కడ పరిస్థితి వివరించాము. ఆయన వెంటనే కుంభకోణం వారితో మాట్లాడి Kg 700 రూపాయలకు కుదిర్చారు. సగం బరువు తగ్గినట్లయ్యింది. 30,000 రూపాయలు Advance పంపించాము. వాళ్ళది పెద్ద సంస్థ. నిపుణులయిన పనివారు ఉన్నారు. Export కూడా ఉంది. అంత కంటే ఎక్కువగా పట్టించుకునే అవకాశం కూడా మాకు లేదు.
గురువుగారు 16-Feb-2008 తారీకు నాడు ముహూర్తం పెట్టారు. 5 రోజుల ప్రతిష్ట కాబట్టి కనీసం 10-02-2008 కన్నా విగ్రహాలు ఇక్కడకు చేరాలి. వాళ్ళు ఒక 20 రోజుల ముందే విగ్రహాలను తయారు చేసి packing చేసి S.R.M.T. వారికి జంగారెడ్డిగూడెం అడ్రసుకు parcel చేసేశారు. సరిగ్గా అప్పుడే S.R.M.T. సంస్థలో కార్మికులు సమ్మె చేశారు.
సమ్మె ఎప్పుడు విరమిస్తారో తెలియదు. విగ్రహాలు కుంభకోణం నుండి మద్రాసు (చెన్నై) డిపోకు, అక్కడ నుండి కాకినాడకు తరువాత జంగారెడ్డిగూడెం చేరవలసి ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. అసలీ విగ్రహాలు ఎక్కడ ఉండిపోయాయో తెలియటం లేదు. సమయానికి చేరతాయో చేరవో. అవి రాకపోతే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు ఉంటుంది.
ఫిబ్రవరి 9 వ తారీకు కూడా వచ్చేసింది. స్వామివారి జాడలేదు. అప్పుడు sudden గా జంగారెడ్డిగూడెం చేరినట్లు Phone వచ్చింది. తెల్లవారాక విగ్రహాలను కారులో బుచ్చెంపేట చేర్చారు. అలాగ ఎంతో ఆందోళన తగ్గింది. పార్శిలు విప్పి చూశాము. బంగారం రంగులో మెరిసి పోతున్న స్వామి వారు, అమ్మవారు, వినాయకుడు దర్శనమిచ్చారు. అవి ఎంత అందంగా ఉన్నాయంటే నోట మాట రాలేదు. కాళ్ళకి దణ్ణం పెట్టుకుని హారతి ఇచ్చాము. స్వామివారి సంపూర్ణ దయ వలన సమయానికి ఎటువంటి ఆటంకం కలుగ కుండా దయ చేశారు. ఇంకొక 20 రోజుల తరువాత కానీ ఉన్నా 30,000 పంపలేక పోయాము. చీంద్రిం వెంకట కృష్ణ గారు 30,000 ఇచ్చారు.
ఆలయ ప్రాంగణం కాంక్రీటు పని