చుట్టూ రైలింగు పని జరుగుతుంటే కొంచెం అందం పెరిగింది. కొద్ది కొద్దిగా జనం వచ్చి చూసి వెళ్లడం మొదలు పెట్టారు. తిబిరిశెట్టి వెంకటేశ్వర రావు – శివ అనే వాళ్ళు గోపురాలు కట్టి నిర్మాణానికి గుడి ఆకారం ఇవ్వడానికి (శిల్పులు) వచ్చారు. Material మనం ఇచ్చి పనికి Rs.1,20,000/- ఇవ్వడానికి కాంట్రాక్టు ఇచ్చాము. ఒక వెయ్యి రూపాయలు advance ఇమ్మన్నారు. ఆ వెయ్యి రూపాయలు కూడా fund గా లేదు. సరే నేను వాళ్ళను మా ఇంటికి తీసుకువెళ్లి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపేశాను.
పని ప్రారంభించడానికి రెండు సైజుల ఇటుకలు ఆలమూరు నుండి మూడు లారీలు తెప్పించమని అలాగే రెండు లారీలు ఇసుక ఒక వంద బస్తాలు సిమ్మెంటు సిధ్ధం చేసుకుని కబురు చేస్తే వచ్చి పని మొదలు పెడతామని వెళ్లిపోయారు.
Advance ఇవ్వటానికే వెయ్యి రూపాయలు ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో ఇవన్నీ ఎప్పటికి సమకూరుతాయో కదా ఏమో ఏం జరుగుతుందో –
మెల్లి మెల్లిగా రైతుల్లో భగవంతుడు కదలిక తీసుకువచ్చాడు.రూపాయలు రావటం మొదలు పెట్టాయి. కావలసిన సరుకులు సమకూర్చుకుని వారికి ఫోన్ చేశాము. మొదట వాళ్ళు slab క్రింద భాగంలో స్తంభాలను తీర్చిదిద్దడం, మండపం పనులు, గదుల బయట డిజైన్లు చేయటం ప్రారంభించారు. వీటి గురించి మాట్లాడకపోవటం వలన వారి కూలి పనుల క్రింద లెక్క చూసి ఇవ్వటం మొదలు పెట్టాము.
వెంకటప్పారావు గారి ఎలక్షను.
2007 లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. బాదే వెంకటప్పారావు గారు ఆయన భార్య తరపున ఎన్నికలలో ఉన్నారు. గెలిస్తే ఖర్చులు పోను సుమారు 7 లక్షలు గుడికి వచ్చేలాగ ఉన్నాయి. ఎన్నికలు గుడికి అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా విడిపోయింది. ఏదోరకంగా గుడికి సొమ్ము సమకూరేలాగ ఆలోచించేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఋజువయ్యింది. ఎలక్షనులో నెగ్గటం వలన మాట ప్రకారం 7 లక్షలు సమకూర్చాలి. ఖర్చుకు సరిపడినంతగా ఇచ్చేలాగ వెసులు బాటు ఇచ్చాము. కాని సమయానుకూలంగా సరిపెట్టలేకపోవడం వలన అన్ని మార్గాల ద్వారా అందే చందాల కంటే ఖర్చు వేలు లక్షల మీద ఎక్కువగా ఉండేది. చందాలకు కూడా అపరిచయస్తుల దగ్గరకు వెళ్ళలేదు. అది ఒక యాచన క్రిందకు వస్తుంది. ప్రయోజనం కూడా అంతంత మాత్రంగా ఉంటుందని అర్థమయ్యింది, అందువలన ఈ ఊరికి సంబంధించిన వ్యక్తుల బంధువర్గం నుండి వారి ద్వారానే ప్రయత్న చెయ్యడం మొదలు పెట్టాము. అందువలన కొంత ప్రయోజనం కనపడింది. ఆ వసూలు చేసి తెచ్చే బాధ్యతను కూడా వాళ్లే తీసుకున్నారు. నేను నా బంధువుల నుండి సాధ్యమయినంత సేకరించడం మొదలు పెట్టాను. కొంచెం ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితే. ఒకరిని అడగటం అలవాటు లేని పని, అయినా తప్పలేదు. ఆ సమయానికి ఆ పరమాత్మ కృపవలన వారిలో దానగుణం కలిగి చందాలు ఇవ్వటం జరుగుతుంది,
విగ్రహాలు తయారీ: